పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుంటే...పవన్ కల్యాణ్ మాత్రం ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు సీఎం కావాలని అరుస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. పిడుగురాళ్ల ప్లీనరీలో మాట్లాడిన ఆయన రెండు సంవత్సరాలు కాదు కదా రెండు జన్మలెత్తినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరన్నారు.